Google వారి Hotel Center

సర్వీస్ నియమాలు

 

Google వారి Hotel Centerకు సంబంధించిన ఈ సర్వీస్ నియమాలకు (“నియమాలు”), Google LLC (“Google”), ఇంకా ఈ నియమాలను ఎగ్జిక్యూట్ చేసే ఎంటిటీ లేదా ఎలక్ట్రానిక్‌గా ఈ నియమాలను అంగీకరించే ఎంటిటీ (“ట్రావెల్ పార్ట్‌నర్”) కట్టుబడి ఉంటాయి.  Google Hotel Centerను ట్రావెల్ పార్ట్‌నర్ వినియోగించే తీరుతో పాటు ఇక్కడ పేర్కొన్న సంబంధిత సర్వీస్‌లు, ఫీచర్‌లు, ఫంక్షనాలిటీ (“సర్వీస్‌లు”) ఈ నియమాల పరిధిలోకి వస్తాయి: (i) ఈ నియమాలకు సంబంధించి, ట్రావెల్ పార్ట్‌నర్‌కు అందించబడిన ఖాతా(లు)కు యాక్సెస్ ఉన్నవి (“ఖాతాలు”) లేదా (ii) రెఫరెన్స్ ఆధారంగా ఈ నియమాలను అనుసరించేవి (సమిష్టిగా, “Hotel Center”).  

 

1. Hotel Centerను ఉపయోగించడం.  Google APIsతో పాటు వివిధ మార్గాలను ఉపయోగించి ట్రావెల్ పార్ట్‌నర్, డేటాను, ఫీడ్‌లను, లేదా ఇతర కంటెంట్‌ను (“కంటెంట్”) Hotel Centerకు సమర్పించవచ్చు. Google ట్రావెల్ పార్ట్‌నర్‌కు అందించిన సూచనలను లేదా నిర్దేశాలను పాటిస్తూ కంటెంట్‌ను సమర్పించడానికి ట్రావెల్ పార్ట్‌నర్ అంగీకారం తెలుపుతుంది. Hotel Center నుండి మరొక Google సర్వీస్‌కు కంటెంట్‌ను ఎగుమతి చేయడానికి, లింక్ చేయడానికి, బదిలీ చేయడానికి లేదా ఉపయోగించడానికి ట్రావెల్ పార్ట్‌నర్‌ను అనుమతించే ఫంక్షనాలిటీని Google అందించవచ్చు. అలాంటి సందర్భాలలో, ఆ ఇతర సర్వీస్‌ను ట్రావెల్ పార్ట్‌నర్ ఉపయోగించే విధానం, ఆ Google సర్వీస్ నియమాలు, షరతులకు లోబడి ఉంటుంది, కాకపోతే, Hotel Centerను ట్రావెల్ పార్ట్‌నర్ ఉపయోగించే విధానం ఈ నియమాలకే కట్టుబడి ఉండటం కొనసాగాలి. ఒకవేళ ట్రావెల్ పార్ట్‌నర్ నిర్దిష్ట ఆప్షనల్ Hotel Center సర్వీస్‌లను ఉపయోగించాలనుకుంటే, ప్రత్యేకంగా ఆ సర్వీస్‌లకు సంబంధించిన ప్రత్యేక నియమాలను ట్రావెల్ పార్ట్‌నర్ అంగీకరించాల్సి రావచ్చు.  కొన్ని Hotel Center సర్వీస్‌లను “బీటా” లేదా సపోర్ట్ లేనివి లేదా గోప్యమైనవిగా (“బీటా ఫీచర్‌లు”) గుర్తించడం జరుగుతుంది.  బీటా ఫీచర్‌లకు సంబంధించిన సమాచారాన్ని గానీ లేదా బీటా ఫీచర్‌ల గురించి గానీ లేదా నియమాలను గానీ లేదా పబ్లిక్ కాని బీటా ఫీచర్‌ల ఉనికిని గానీ ట్రావెల్ పార్ట్‌నర్ బహిర్గతం చేయకూడదు.  Google లేదా దాని అనుబంధ సంస్థలు, ఏ సమయంలోనైనా బీటా ఫీచర్‌లతో పాటు సర్వీస్‌లను సస్పెండ్ చేయవచ్చు, సవరించవచ్చు లేదా నిలిపివేయవచ్చు.  ఈ నియమాలలో పేర్కొన్న “అనుబంధ సంస్థ” అంటే, సమయానుసారంగా Googleను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కంట్రోల్ చేసే, Google కంట్రోల్‌లో ఉండే, లేదా Googleతో ఉమ్మడి కంట్రోల్‌లో ఉండే ఎంటిటీ అని అర్థం.

 

2. ఖాతా.  Hotel Centerను ట్రావెల్ పార్ట్‌నర్ ఉపయోగించే విధానం అనేది Google ద్వారా ఒకటి లేదా అంత కంటే ఎక్కువ ఖాతాల క్రియేషన్‌కు, ఇంకా ఆమోదానికి లోబడి ఉంటుంది.  ఖాతాలను వెరిఫై చేయడానికి, అలాగే ఎప్పటికప్పుడు, చట్టపరమైన ఎంటిటీ పేరు, బిజినెస్ అందించే ప్రోడక్ట్/సర్వీస్, ప్రధాన కాంటాక్ట్, ఫోన్ నంబర్, అడ్రస్, అలాగే సంబంధిత డొమైన్‌లతో పాటు Googleకు అదనపు సమాచారం అవసరం కావచ్చు. ఖాతాలను యాక్సెస్ చేయడం, ఉపయోగించడం, ఖాతాల ద్వారా Hotel Centerకు సమర్పించే కంటెంట్, అలాగే ఖాతా యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌ల రక్షణతో సహా Hotel Centerను ట్రావెల్ పార్ట్‌నర్ ఎలా ఉపయోగించాలి అనే విషయానికి సంబంధించిన బాధ్యత ఆ ట్రావెల్ పార్ట్‌నర్‌పైనే ఉంటుంది.

 

3. పాలసీలు

Hotel Centerను ట్రావెల్ పార్ట్‌నర్ ఉపయోగించే విధానం వీటికి లోబడి ఉంటుంది: (i) ఈhttps://support.google.com/hotelprices/topic/11077677 లింక్‌లో అందుబాటులో ఉన్న వర్తించే Google పాలసీలకు, అలాగే ట్రావెల్ పార్ట్‌నర్‌కు Google అందించే అన్ని ఇతర పాలసీలకు, వీటిని Google ఎప్పటికప్పుడు మార్చవచ్చు (సమిష్టిగా “పాలసీలు”), (ii) ఈ నియమాలకు, అలాగే (iii) వర్తించే చట్టం(లు)కు ట్రావెల్ పార్ట్‌నర్ కట్టుబడి ఉందా లేదా అనే విషయానికి. 

Hotel Center విషయానికి వస్తే, (i) Google google.com/policies/privacy లింక్‌లో అందుబాటులో ఉన్న Google గోప్యతా పాలసీకి కట్టుబడి ఉంటుంది (ఎప్పటికప్పుడు పాలసీలో మార్పులు జరిగినా కూడా), అలాగే (ii) వర్తించేంత మేరకు, Google, ఇంకా ట్రావెల్ పార్ట్‌నర్, https://privacy.google.com/businesses/gdprcontrollerterms/ లింక్‌లో ఉన్న Google కంట్రోలర్-కంట్రోలర్ డేటా రక్షణ నియమాలను (“డేటా సంరక్షణ నియమాలు”) అంగీకరిస్తారు.  డేటా సంరక్షణ నియమాలలో స్పష్టంగా అనుమతించిన దాని ప్రకారం తప్ప Google డేటా సంరక్షణ నియమాలను సవరించదు.

 

4. ట్రావెల్ పార్ట్‌నర్ కంటెంట్.

a. Google లేదా దాని అనుబంధ సంస్థల ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లకు సంబంధించి, కంటెంట్‌ను ఉపయోగించడానికి, Googleకు, దాని అనుబంధ సంస్థలకు ట్రావెల్ పార్ట్‌నర్ శాశ్వతమైన, ఉపసంహరించుకోలేని, ఉచిత లైసెన్స్‌ను (మేధో సంపత్తి హక్కుల ద్వారా రక్షించబడేంత మేరకు) మంజూరు చేస్తుంది. Google, అలాగే దాని అనుబంధ సంస్థలు, ఈ హక్కులను మా తరఫున సర్వీస్‌లను అందించే మా కాంట్రాక్టర్‌లకు, అలాగే మా యూజర్‌లకు సబ్ లైసెన్స్ ఇవ్వవచ్చని ట్రావెల్ పార్ట్‌నర్ అంగీకరిస్తుంది, తద్వారా ఆ కాంట్రాక్టర్‌లు, యూజర్‌లు, Google లేదా దాని అనుబంధ సంస్థల ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను ఉపయోగించడానికి ఆ కంటెంట్‌ను ఉపయోగించగలరు.

b. ట్రావెల్ పార్ట్‌నర్ సమర్పించిన కంటెంట్‌లో URLలు లేదా అలాంటి కంటెంట్ ఉన్నట్లయితే, URL(ల)ను, అలాగే ఆ URL(ల)లో ("గమ్యస్థానాలు") అందుబాటులో ఉండే కంటెంట్‌ను యాక్సెస్, ఇండెక్స్, కాష్ లేదా క్రాల్ చేయడానికి కావలసిన హక్కును Googleకు, అలాగే దాని అనుబంధ సంస్థలకు ట్రావెల్ పార్ట్‌నర్ మంజూరు చేస్తుంది.  ఉదాహరణకు, ఆ URLలకు అనుబంధించబడి ఉన్న వెబ్‌సైట్‌లను పొందడానికి, విశ్లేషించడానికి Google ఒక ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించవచ్చు.  గమ్యస్థానాల నుండి Google లేదా దాని అనుబంధ సంస్థలు సేకరించిన ఏ కంటెంట్ అయినా, కంటెంట్‌గానే పరిగణించబడుతుందని, అలాగే ఈ నియమాలకు అనుగుణంగా అది వ్యవహరించబడుతుందని ట్రావెల్ పార్ట్‌నర్ అంగీకారం తెలుపుతుంది.

c. Hotel Centerను ఉపయోగించడం ద్వారా, కంటెంట్‌ను Google అధికారికంగా ఉపయోగించడానికి, వ్యాపారచిహ్నాలను, సర్వీస్ మార్క్‌లను, ట్రేడ్ పేరులను, యాజమాన్య లోగోలను, డొమైన్ పేర్లను, ఇంకా ఇతర సోర్స్ లేదా బిజినెస్ ఐడెంటిఫయర్‌లను ఉపయోగించుకోవడానికి ట్రావెల్ పార్ట్‌నర్ Googleకు అనుమతి ఇస్తుంది.

 

5. టెస్టింగ్.  ట్రావెల్ పార్ట్‌నర్ Googleకు, దాని అనుబంధ సంస్థలకు వీటిని చేయడానికి అధికారం ఇస్తుంది: (a) ట్రావెల్ పార్ట్‌నర్‌కు ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే, దాని సర్వీస్‌ల వినియోగంపై (గమ్యస్థానాలు, క్వాలిటీ, ర్యాంకింగ్, పనితీరు, ఫార్మాటింగ్ లేదా ఇతర సర్దుబాటులకు సంబంధించిన వాటితో సహా) ప్రభావం చూపే అవకాశమున్న టెస్ట్‌లను కాలానుగుణంగా నిర్వహించడానికి, ఇంకా (b) గమ్యస్థానాలను పొందడాన్ని, ఇంకా విశ్లేషించడాన్ని ఆటోమేట్ చేయడానికి, అలాగే ఆ గమ్యస్థానాలను యాక్సెస్ చేయడానికి టెస్ట్ ఆధారాలను క్రియేట్ చేయడానికి.

 

6. వారంటీ, హక్కులు, అలాగే అనివార్యకార్యాలు.  ట్రావెల్ పార్ట్‌నర్ వీటికి ప్రాతినిధ్యం వహించి హామీ ఇస్తుంది: (a) ఈ నియమాలకు అంగీకారం తెలపడానికి ట్రావెల్ పార్ట‌నర్‌కు సంపూర్ణ హోదా, అలాగే అధికారం ఉంది, (b) సెక్షన్ 4లో పేర్కొన్న లైసెన్స్‌లను, అనుమతులను జారీ చేసే హక్కులు ట్రావెల్ పార్ట్‌నర్‌కు ఉన్నాయి, అలాగే అవి దాని వద్దనే ఉంటాయి, (c) పాలసీలను, వర్తించే చట్టాన్ని లేదా వర్తించే గోప్యతా పాలసీలను ఉల్లంఘించే కంటెంట్‌ను, లేదా థర్డ్ పార్టీ మేధో సంపత్తి హక్కులను అతిక్రమించే కంటెంట్‌ను ట్రావెల్ పార్ట్‌నర్ అందించదు (d) వర్తించే డేటా గోప్యత లేదా డేటా సంరక్షణ చట్టాలు లేదా నియంత్రణల కింద రక్షణ ఉన్న, ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని లేదా ఆ వ్యక్తి నుండి సేకరించిన సమాచారాన్ని Googleకు అందించడానికి అవసరమైన అన్ని హక్కులు, సమ్మతులు ట్రావెల్ పార్ట్‌నర్‌కు ఉన్నాయి, అలాగే (e) ట్రావెల్ పార్ట్‌నర్ సంపూర్ణమైన, సరైన, ఇంకా చెల్లుబాటు అయిన సమాచారాన్ని, అధికారాలను (ట్రావెల్ పార్ట్‌నర్ ఆఫర్‌లను ప్రదర్శించడానికి కావలసిన ప్రోడక్ట్ సంబంధిత బహిర్గతాలన్నింటితో సహా) అందిస్తుంది.

 

7. నిరాకరణలు.  చట్టం అనుమతించే పూర్తి పరిమితి వరకు, అన్ని వారంటీలను, అవి చట్టం ద్వారా అమలులోనున్న వారంటీలు, చట్టబద్ధమైన వారంటీలు, లేదా ఇంకేవైనా సరే, Google, అలాగే దాని అనుబంధ సంస్థలు   నిరాకరిస్తాయి, వీటిలో అతిక్రమణకు పాల్పడనివి, సంతృప్తికరమైన క్వాలిటీ గలవి, విక్రయార్హత గలవి లేదా ఏదైనా ప్రయోజనానికి సంబంధించిన ఫిట్‌నెస్ వారంటీలతో పాటు ఏదైనా వ్యవహారంలో భాగంగా లేదా వ్యాపార వినియోగంలో భాగంగా ఉత్పన్నమయ్యే వారంటీలు కూడా ఉంటాయి.  చట్టం అనుమతించే పూర్తి పరిమితి వరకు, Hotel Center, ఇంకా దాని సంబంధిత సర్వీస్‌లు, "యథాతథంగా," "అందుబాటులో ఉన్నట్లు", అలాగే "అన్ని లోపాలతో" అందించబడతాయి, వాటిని వ్యాపారి, వారి స్వంత పూచీపై ఉపయోగిస్తారు. Hotel Center లేదా దాని సంబంధిత సర్వీస్‌ల విషయంలో, లేదా వాటి పర్వవసానాల విషయంలో, Google, అలాగే దాని అనుబంధ సంస్థలు ఎలాంటి హామీలనూ ఇవ్వవు. లోపాలను లేదా ఎర్రర్‌లను వ్యాపారికి తెలియజేస్తామని Google, అలాగే దాని అనుబంధ సంస్థలు హామీ ఇవ్వవు.

 

8. చట్టపరమైన బాధ్యత పరిమితి.  చట్టం అనుమతించే పూర్తి పరిమితి వరకు, సిద్ధాంతం లేదా క్లెయిమ్ రకంతో సంబంధం లేకుండా, (A) ఈ నియమాల కారణంగా, లేదా ఈ నియమాల పనితీరు కారణంగా, లేదా ఈ నియమాల పనితీరుకు సంబంధించిన వాటి కారణంగా ప్రత్యక్ష నష్టాలు కాకుండా ఇంకే విధమైన నష్టాలు జరిగినా కూడా Google, ఇంకా దాని అనుబంధ సంస్థలు బాధ్యత వహించవు, Google లేదా దాని అనుబంధ సంస్థలలో ఏదోక దానికి ఇతర నష్టాలు జరిగే అవకాశముందని తెలిసినా కూడా లేదా తెలియాల్సి ఉన్నా కూడా, అలాగే ప్రత్యక్ష నష్టాలకు నివారణోపాయాలు లేకపోయినా కూడా అవి బాధ్యత వహించవు; ఇంకా (B) ఈ నియమాల కారణంగా, లేదా ఈ నియమాల పనితీరు కారణంగా, లేదా ఈ నియమాల పనితీరుకు సంబంధించిన వాటి కారణంగా ఏదైనా ఈవెంట్ విషయంలో లేదా లింక్ ఉన్న కొన్ని ఈవెంట్‌ల విషయంలో నష్టాల విలువ మొత్తంగా $5,000.00 దాటినప్పుడు Google, ఇంకా దాని అనుబంధ సంస్థలు బాధ్యత వహించవు.

 

9. నష్ట పరిహారం.  వర్తించే చట్టం అనుమతించే పూర్తి పరిమితి వరకు, ట్రావెల్ పార్ట్‌నర్ కంటెంట్, గమ్యస్థానాలు, Hotel Center వినియోగం, దాని సంబంధిత సర్వీస్‌ల వినియోగం లేదా ట్రావెల్ పార్ట్‌నర్ ద్వారా ఈ నియమాల ఉల్లంఘన జరగడం కారణంగా తలెత్తే, లేదా ఈ అంశాలకు సంబంధించి ఏదైనా థర్డ్-పార్టీ చట్టపరమైన చర్య ప్రారంభించబడినప్పుడు, దానికి సంబంధించిన అన్ని బాధ్యతలు, ప్రమాదాలు, నష్టాలు, వ్యయాలు, ఫీజులు (చట్టపరమైన ఫీజులతో సహా), ఇంకా ఖర్చుల నుండి Googleను, దాని అనుబంధ సంస్థలను, ఏజెంట్‌లను, ఇంకా లైసెన్స్ జారీ చేసేవారిని ట్రావెల్ పార్ట్‌నర్ రక్షిస్తుంది, అలాగే నష్టపరిహారం చెల్లిస్తుంది.

 

10. ఉపసంహారం.  ఇక్కడ పేర్కొన్న సందర్భాలలో, Hotel Center, సర్వీస్‌లు లేదా ఖాతా(లు)కు ట్రావెల్ పార్ట్‌నర్ యాక్సెస్‌పై లేదా వాటి వినియోగంపై పరిమితి విధించే, వాటిని సస్పెండ్ చేసే లేదా ముగించే (పూర్తిగా లేదా పాక్షికంగా) హక్కు Googleకు ఉంది: (a) ఈ నియమాలను, ఏవైనా పాలసీలను లేదా వర్తించే చట్టం(లు)ను ట్రావెల్ పార్ట్‌నర్ ఉల్లంఘించినప్పుడు, (b) ఏదైనా చట్టపరమైన అవసరం లేదా న్యాయస్థాన ఆదేశాన్ని పాటించడానికి Google అలా చేసినప్పుడు (c) సదరు ట్రావెల్ పార్ట్‌నర్ ప్రవర్తన వలన మరొక ట్రావెల్ పార్ట్‌నర్‌కు గానీ, థర్డ్ పార్టీకి గానీ లేదా Googleకు గానీ నష్టం కలుగుతుందని లేదా బాధ్యత వహించేలా చేస్తుందని Googleకు సహేతుకంగా అనిపించినప్పుడు. ఒకవేళ ట్రావెల్ పార్ట్‌నర్‌కు, దానికి Hotel Centerకు, సర్వీస్‌లకు లేదా ఖాతా(లు)కు ఉన్న యాక్సెస్ పొరపాటున పరిమితం చేయబడిందని, సస్పెండ్ చేయబడిందని, లేదా ముగించబడిందని అనిపిస్తే, దయచేసి మా పాలసీలలో ఉన్న అప్పీల్ ప్రాసెస్‌ను రెఫర్ చేయండి. ట్రావెల్ పార్ట్‌నర్ దాని ఖాతా(లు)ను మూసివేయడం ద్వారా, అలాగే Hotel Centerను ఉపయోగించడం ఆపివేయడం ద్వారా, ఏ సమయంలోనైనా ఈ నియమాలను ముగించవచ్చు.

 

11. నియమాలకు మార్పులు.  Google ఈ నియమాలకు ఏ సమయంలోనైనా ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే చిన్న చిన్న మార్పులు చేయవచ్చు, కానీ ఈ నియమాలకు పెద్ద మార్పులేవైనా చేయాల్సి వస్తే Google అడ్వాన్స్ నోటీస్ ఇస్తుంది. ఈ నియమాలకు చేసిన మార్పులు రెట్రోయాక్టివ్‌గా వర్తించవు, ఈ పేజీలో పోస్ట్ చేసిన 7 రోజుల తర్వాత అవి అమలులోకి వస్తాయి. కానీ, చట్టపరమైన కారణాల దృష్ట్యా లేదా అత్యవసర పరిస్థితులలో (ప్రస్తుతం కొనసాగుతున్న దుర్వినియోగాన్ని నిరోధించడం వంటివి) చేసిన మార్పులు, నోటీస్ ఇచ్చిన వెంటనే అమలులోకి వచ్చేస్తాయి.

 

12. పాలక చట్టం; వివాద పరిష్కారం. ఈ నియమాలు లేదా Hotel Centerకు సంబంధించిన లేదా వాటి మూలంగా తలెత్తే క్లెయిమ్‌లన్నీ, కాలిఫోర్నియా పరస్పర విరుద్ధమైన చట్ట సంబంధిత నియమాలు మినహాయించి, కాలిఫోర్నియా చట్టం పరిధిలోకి వస్తాయి, అలాగే వీటికి సంబంధించిన న్యాయ విచారణ USAలోని కాలిఫోర్నియాకు చెందిన శాంటా క్లారా కౌంటీలోని ఫెడరల్ లేదా రాష్ట్ర న్యాయస్థానాలలో మాత్రమే జరుగుతుంది; సంబంధిత పార్టీలు, తమపై విచారణ జరిపి తీర్పును వెలువరించే అధికారం ఆ కోర్టులకు ఉందని సమ్మతిస్తాయి.  ఒకవేళ ట్రావెల్ పార్ట్‌నర్ వర్తించే అధికారిక ప్రదేశానికి చెందిన ఎంటిటీ అయితే, ఈ నియమాలు లేదా Hotel Center మూలంగా Googleతో తలెత్తే వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకొనేందుకు కూడా ట్రావెల్ పార్ట్‌నర్ దరఖాస్తు చేసుకోవచ్చు. మేము ఏ మధ్యవర్తులతో అయితే ఎంగేజ్ అవ్వడానికి మొగ్గు చూపుతామో వారికి సంబంధించిన మరిన్ని వివరాలు, అలాగే మధ్యవర్తిత్వాన్ని ఎలా రిక్వెస్ట్ చేయాలి అనే దానికి సంబంధించిన సూచనలను ఇక్కడ చూడండి. వర్తించే చట్టం ప్రకారం తప్పనిసరి అయిన పరిస్థితులలో తప్ప, మధ్యవర్తిత్వం అనేది స్వచ్ఛందమైన విషయం, ట్రావెల్ పార్ట్‌నర్ గానీ లేదా Google గానీ తప్పనిసరిగా మధ్యవర్తిత్వం ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవాలనే షరతు ఏమీ లేదు.

 

13. ఇతర అంశాలు. (a) ఈ నియమాలను, పార్టీల విషయానికి సంబంధించి వారి మధ్య కుదిరిన సంపూర్ణ ఒప్పందంగా పరిగణించడం జరుగుతుంది, వీటిని అంగీకరించిన తర్వాత, Hotel Centerకు సమర్పించిన కంటెంట్ విషయంలో Googleకు, ట్రావెల్ పార్ట్‌నర్‌కు మధ్య కుదిరిన కంటెంట్ లైసెన్స్ ఒప్పందం(లు)తో సహా, ఆ విషయాలకు సంబంధించి వారి మధ్య ఉన్న పూర్వ ఒప్పందాలను లేదా సమకాలీన ఒప్పందాలను ఈ నియమాలు అధిగమిస్తాయి. (b) ఈ నియమాలలో పేర్కొన్న సంబంధం గురించి ట్రావెల్ పార్ట్‌నర్ బహిరంగంగా ఎలాంటి ప్రకటనా చేయరాదు (చట్టం ప్రకారం అవసరమైన సందర్భాలలో తప్ప). (c) సెక్షన్ 11 ప్రకారం Google నియమాలను మార్చినప్పుడు మినహా, ఈ నియమాలకు ఏదైనా సవరణ చేయాలంటే, అందుకు ఇరు పార్టీలు ఆమోదించాలి, అలాగే అది నియమాలను సవరిస్తోందని తప్పనిసరిగా స్పష్టంగా పేర్కొనాలి. (d) ఉపసంహారం లేదా ఉల్లంఘనకు సంబంధించిన నోటీస్‌లన్నీ తప్పనిసరిగా రాతపూర్వకంగా ఉండాలి, అలాగే వాటిని అవతలి పార్టీకి సంబంధించిన లీగల్ డిపార్ట్‌మెంట్‌కు పంపాలి (లేదా ఒకవేళ అవతలి పార్టీకి లీగల్ డిపార్ట్‌మెంట్ ఉందో లేదో తెలియకపోతే, ఆ పార్టీకి సంబంధించిన ప్రధాన కాంటాక్ట్‌కు లేదా ఫైల్‌లో ఉన్న అడ్రస్‌కు పంపాలి). ఈమెయిల్స్‌ను రాతపూర్వక నోటీస్‌లలాగానే పరిగణించడం జరుగుతుంది. Google లీగల్ డిపార్ట్‌మెంట్‌కు పంపించే నోటీస్‌లకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్, legal-notices@google.com.  ట్రావెల్ పార్ట్‌నర్‌కు పంపవలసిన ఇతర నోటీస్‌లన్నీ రాతపూర్వకంగా ఉండాలి, అలాగే వాటిని ట్రావెల్ పార్ట్‌నర్ ఖాతాకు అనుబంధించబడిన ఈమెయిల్ అడ్రస్‌కు పంపాలి.  Googleకు పంపవలసిన ఇతర నోటీస్‌లన్నీ రాతపూర్వకంగా ఉండాలి, అలాగే Google వద్దనున్న ట్రావెల్ పార్ట్‌నర్‌కు సంబంధించిన ప్రధాన కాంటాక్ట్‌కు పంపాలి లేదా Google అందించే వేరే ఏ పద్ధతి ద్వారా అయినా పంపాలి. రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్ధారించిన తర్వాత, నోటీస్ అందినట్టు పరిగణించబడుతుంది. ఈ నోటీస్ ఆవశ్యకతలు ప్రాసెస్‌కు సంబంధించిన చట్టపరమైన సర్వీస్‌కు వర్తించవు, ఇది వర్తించే చట్టానికి కట్టుబడి ఉంటుంది. (e) ఇరు పార్టీలూ ఈ నియమాల కింద ఏ హక్కునైనా వినియోగించుకోని పక్షంలో (లేదా వినియోగించుకోవడం ఆలస్యం చేస్తున్న పక్షంలో), ఆ హక్కులను పార్టీలు వదులుకున్నట్లుగా పరిగణించడం జరగదు. (f) ఈ నియమాలలో ఏదైనా నియమం అమలుపరచలేనిదిగా గుర్తించబడినట్లయితే, అది తీసివేయబడుతుంది, మిగతా నియమాలన్నీ పూర్తి ప్రభావంతో అమలులో ఉంటాయి. (g) ట్రావెల్ పార్ట్‌నర్, ఈ నియమాల కింద దాని హక్కులను లేదా బాధ్యతలను, Google నుండి ముందస్తు రాతపూర్వక సమ్మతి లేకుండా ఇతరులకు కేటాయించలేదు.  (h) ఈ నియమాలలో థర్డ్-పార్టీ లబ్దిదారులు ఎవరూ లేరు. (i) ఈ నియమాలు, పార్టీల మధ్య ఏజెన్సీ, భాగస్వామ్యం, సంయుక్త వ్యాపారం లేదా ఉపాధి సంబంధాన్ని క్రియేట్ చేయవు. (j) ఈ నియమాల గడువు అయిపోయినా లేదా అవి ముగించబడినా, 1, 4, 6-10, ఇంకా 12-13 సెక్షన్‌లు అమలులోనే ఉంటాయి. (k) పార్టీ లేదా దాని అనుబంధ సంస్థలు, ఏమాత్రం తమ కంట్రోల్‌లో లేని పరిస్థితుల కారణంగా పనులు చేయడంలో విఫలమైనా లేదా పనితీరులో జాప్యం జరిగినా, దానికి అవి బాధ్యత వహించవు.